KDP: కమలాపురంలో రూ.65 కోట్లతో రైల్వే వంతెన పనులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రారంభించనున్నట్లు టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి అధికారులు, నాయకులు, తదితరులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.