NRPT: నారాయణపేట పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, 21 ఏళ్ల వయస్సు వంటి అర్హతలు తప్పనిసరని చెప్పారు. మైనారిటీ వర్గాలకు ప్రత్యేక స్థానాలు ఉండగా, ఒక మహిళకు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గలవారు తగిన పత్రాలతో ఏప్రిల్ 6లోపు మున్సిపల్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.