MDCL: ఎక్కడైనా అనుమతి లేకుండా డీజేలు పెడుతున్నారా..? వెంటనే ఫిర్యాదు చేయాలని మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి సూచించారు. కాలనీలు, వీధుల్లో భారీ శబ్దంతో డీజేలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీస్ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.