ATP: గుత్తి పట్టణ శివారులోని నేసే వీధిలో మంగళవారం చెట్టుకు ఉరివేసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.