ADB: ఇచ్చోడ మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ బండారి రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 3 మోటార్ సైకిల్లు, 9 మొబైల్ ఫోన్లు, రూ.4470 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ నిర్వహిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని CI రాజు హెచ్చరించారు.