కృష్ణా: మచిలీపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో మాతృ మరణాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై DHMO యుగంధర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మాతృ, శిశువు మరణాలను తగ్గించడం కోసం వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా సమన్వయంతో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
NDL: ఐపీఎల్ నేపథ్యంలో నంద్యాల జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే 100/112కు తెలియజేయాలని, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు. ఈ చర్యలు నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించబడ్డాయని పేర్కొన్నారు.
E.G: ఐపీఎల్ మ్యాచ్‌ల సాకుతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలతో యువతను లక్ష్యంగా చేసుకునే వారిపై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వాహకుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు తెలపాలని కోరారు.
ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి పోలీసులు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించారు.
HYD: హైడ్రా కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 58 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాలనీ రహదారుల కబ్జాలు తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.
NDL: బేతంచెర్ల మండలంలోని శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో ఇవాళ బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఉప కమిషనర్ ఎం.రామాంజనేయులు సోమవారం తెలిపారు. సప్లయర్, గ్రైండర్, బొమ్మల అంగడి సహా పలు షాపుల నిర్వహణ హక్కులకు వేలం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దేవస్థానం నిబంధనల మేరకు పాల్గొనాలని సూచించారు. భక్తుల సౌకర్యం దృష్ట్యా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
KMM: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. పెనుబల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒంటిపూట బడుల సమయాన్ని పెంచడం సరికాదని వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ ఒంటిపోటు బడులను పెడితే రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
PPM: బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులగా తీర్చి దిద్దడమే ద్యేయంగా కృషి చేయాలని జిల్లా ఆర్ బి.ఎస్.కె అధికారి డా,జగన్ మోహనరావు సూచించారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం పౌష్టికాహార పునరావాస కేంద్రాలను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. డిఈఐసి ప్రతిరోజు 4డి పిల్లలకు అందజేస్తున్న వైద్య సేవలు, పర్యవేక్షణ వివరాలు రికార్డులు తనిఖీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓగా రావాడ వెంకట్రామన్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం విజయనగరం జడ్పీ డిప్యూటీ సీఈఓగా ఉన్న ఆయన, గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో విజిలెన్స్ అధికారిగా, డిఆర్డిఏ, ఎంపీడీవోగా పనిచేశారు. ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారని ఆఫీస్ వర్గాలు తెలిపాయి.
SRPT: పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సోమవారం హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానించిన కాపీని కలెక్టర్‌కు అందజేశారు. ఏప్రిల్ 1న అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ పోనుగోటి నరేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం పొట్పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పట్నం ఝరప్ప (58) సోమవారం పండరీపూర్ యాత్ర ముగించుకొని తుల్జాపూర్ భవాని మాతను దర్శించేందుకు క్యూ లైన్‌లో ఉండగానే ఛాతిలో నొప్పి రావడంతో అక్కడి సెక్యూరిటీ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో గుండెపోటు రావడంతో రాత్రి మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు.
IPL 2026: CSKపై అర్థసెంచరీ(52)తో RR యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సొంత రికార్డ్ బ్రేక్ చేసుకున్నాడు. గతేడాది అతను 17 బంతుల్లో సాధించిన ఫిఫ్టీ.. RR తరఫున రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అయితే నిన్న 15 బంతుల్లోనే మరో హాఫ్ సెంచరీ చేసి నాటి రికార్డ్‌ను తిరగరాశాడు. ఓవరాల్‌గా RR తరఫున ఫాస్టెస్ట హాఫ్ సెంచరీ రికార్డ్ యశస్వీ జైస్వాల్(2023లో 13 బాల్స్ vs KKR) పేరిట ఉంది.
ఏప్రిల్ నెలకు సంబంధించి ఆర్బీఐ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేసింది. ఏప్రిల్ 1 వార్షిక ఖాతా ముగింపు, 2న మాండీ థర్స్ డే, 3న గుడ్‌ఫ్రైడే, 5, 12, 19, 26 ఆదివారాలు, 11, 25 రెండు, నాలుగో శనివారం, 13న బైసాఖి, 14న అంబేద్కర్ జయంతి అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. 15న తమిళ నూతన సంవత్సరం, 20న బసవ జయంతి సందర్బంగా కర్ణాటకలో మాత్రమే సెలవు ఉంటుంది.
HYD: మార్కెట్‌లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత వారం మాంసం KG రూ. 300 నుంచి రూ. 325 మధ్య అమ్ముడుపోయింది. ఆదివారం నుంచి ధరలు తగ్గుతూ వచ్చాయి. HYDలో ఇవాళ విత్‌స్కిన్ KG రూ.220, స్కిన్‌లెస్ రూ. 251 చొప్పున ధర నిర్ణయించారు. ఇదిలా ఉంటే మార్జిన్ పెంచాలన్న డిమాండ్‌తో రేపటి నుంచి నగరంలో చికెన్ షాపుల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చారు.
PPM: యువత PM ఇంటర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.9,000ల చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందన్నారు. ఈ మేరకు టెన్త్, ITI, డిప్లామా, డిగ్రీ పూర్తిచేసి 18-25 మధ్య వయసు గలవారు https:// pminternship.mca.gov.in వెబ్ సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.