నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న మూవీ ‘రామాయణ’. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ గ్లింప్స్ విడుదల కానుంది. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ వీడియోను ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకులు దీని విజువల్స్ చూసి మంత్రముగ్ధులయ్యారు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న గ్రాఫిక్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో 8వ వార్డ్ అంగడి బజార్‌లో 100kv ట్రాన్స్‌ఫార్మర్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీ విద్య శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, వెంకన్న Ae ప్రభాకర్, AD బాలు పాల్గొన్నారు.
TG: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది.
HNK: BJP స్టేట్ ఎగ్జిక్యూటివ్ స్పెషల్ ఇన్వైటీస్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు నియమితులయ్యారు. మాజీ మేయర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, సీతారాం నాయక్, వీ. జయపాల్ లను రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు.
SDPT: సిద్దిపేట పోలీస్ శాఖ చేపట్టిన “ఉద్యోగ మిత్ర” కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తున్నట్లు బెజ్జంకి ఎస్సై బి. సౌజన్య తెలిపారు. మండల పరిధిలోని పలు ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని తక్షణం బెజ్జంకి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
NLR: చైన్ స్నాచింగ్ కేసులో 24 గంటలలోపు దొంగను అరెస్టు చేసినట్లు నెల్లూరు టూ టౌన్ సీఐ గిరిబాబు చెప్పారు. ఈ నెల 27న వైకుంటపురంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భోజనం చేసి ఇంటికి వెళుతున్న మహిళల మెడలో గొలుసు లాక్కొని వెళ్లాడని ఫిర్యాదు అందింది. SI షేక్ గౌస్ బాషా దొంగను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు
ప్రకాశం: కంభం పట్టణంలోని రహమత్ నగర్ మొదటి లైన్‌లో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని యాచకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
KMR: పట్టణంలోని బస్తీ దవాఖానను మంగళవారం DM&HO డా.రవీందర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్తీ దవాఖానా ద్వారా ప్రజలు పొందుతున్న సేవల వివరాలపై సిబ్బందిని అడిగి ఆరా తీశారు. ఫార్మసీ ల్యాబ్ తదితర గదులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలన్నారు.
KRNL: రాయలసీమ యూనివర్సిటీ మహిళా ఖో-ఖో జట్టు కర్ణాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 5 వరకు జరిగే అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా ఇవాళ యూనివర్సిటీ ప్రాంగణంలో మహిళా జట్టుకు ఉపకులపతి వెంకట బసవరావు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
VZM: వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని OBC సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి చిలకలపల్లి శ్రీనివాసరావు కోరారు. విజయనగరంలో హోమంత్రి అనితకు వినతిపత్రం అందించారు. వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వృత్తిదారులకు ఆధునిక పనిముట్లు ఇవ్వాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.
నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ‘కోర్ట్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. తదుపరి చిత్రాల కోసం ఆయన మాలీవుడ్ హీరోలపై దృష్టి సారించినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తన బ్యానర్‌లో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ హీరోగా మురళీకాంత్ దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా రామ్ జగదీష్ దర్శకత్వంలో మరో సినిమా రానున్నట్లు టాక్.
SRD: తెలంగాణలో దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి త్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం భౌమ వాసరే పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
SRCL: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వేములవాడకు చెందిన సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ నియమితులయ్యారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ప్రతాప రామకృష్ణ వేములవాడ సర్పంచుగా సైతం సేవలందించారు. సీనియర్ నాయకుడు రామకృష్ణకు సిరిసిల్ల జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు.
జియో స్టూడియోస్ నిర్మించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ మూవీ ఇప్పటివరకు దేశీయంగా రూ.872.17 కోట్ల నెట్, రూ.1,042.23 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తోంది. ఓవర్సీస్‌లో కూడా రూ.350 కోట్లు రాబట్టి సత్తా చాటింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1,392.23 కోట్లు సాధించి, త్వరలోనే రూ.1400 కోట్ల మైలురాయిని చేరనున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ELR: ఉంగుటూరు మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో ఇవాళ ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. ఈ సందర్భంగా GP నిధులు 15.35లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సీసీ, డ్రైన్ల నిర్మాణానికీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.