WNP: వీపనగండ్ల, పానగల్ మండలాల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, వికారాబాద్ ఇన్ఛార్జ్ సుధాకర్ రావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ప్రవీణ్, మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.