GDWL: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవలో పాల్గొనాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ బాలుర పాఠశాలలో ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణ వల్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, ఇవి భవిష్యత్తులో ఉద్యోగాలకు ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.