MHBD: కురవి మండలంలోని స్టేషన్ గుండ్రాతిమడుగుకు చెందిన తేజావత్ మల్సూర్ అనే రైతు పండించిన ఐదు క్వింటాల మిర్చి పంటను గ్రేడింగ్ కోసం కల్లంలో ఆరబెట్టాడు. రాత్రి సమయంలో ఐదు క్వింటాల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై రైతు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, సంఘటన స్థలానికి ఎస్సై సతీష్ చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.