BDK: గిరిజన నిరుద్యోగ యువతకు కేరళంలోని కొచ్చిలో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు పీవో బి.రాహుల్ శనివారం తెలిపారు. ఐటీఐ లేదా డిప్లొమా చేసిన అర్హులైన గిరిజన యువతీ, యువకులు ఈ నెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇండస్ట్రీయల్ ఎలక్ట్రిషియన్, వెల్డర్ వంటి కోర్సుల్లో 6 నెలల పాటు ఉచిత వసతితో శిక్షణ ఇచ్చి, అనంతరం ఉపాధి కల్పిస్తారన్నారు.