SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకి పండిన వరి ధాన్యం నేల రాలింది. దీంతో ఆరుగాలం పండించిన పంట నేల రాలడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, అధికారుల చేత పంట నష్టం సర్వే నిర్వహించి వెంటనే నష్టపరిహారం ఇప్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.