WGL: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.