SRCL: వీర్నపల్లి మండలంలోని ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. రంగంపేటకు వెళ్లే దారిలో సబ్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి, ఈదురు గాలులకి భారీగా చెట్లు, విద్యుత్ స్థంబాలు విరిగి రోడ్డు మీద పడ్డాయి. దీంతో రంగపేట, వీర్నపల్లి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం చెట్లను తొలగించి రవాణా సౌకర్యం కల్పించారు.