• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్ వద్ద నిరసన

MDK: ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ స్పాట్ సెంటర్‌లో మంగళవారం నిరసన చేపట్టారు. 2025 మూల్యాంకన రెమ్యూనరేషన్, 2024 కులగణన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. భోజన విరామంలో జరిగిన ఈ కార్యక్రమంలో సతీష్ కుమార్, రాజగోపాల్ గౌడ్, పద్మారావు పాల్గొన్నారు. స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

April 7, 2026 / 05:31 PM IST

సమాజ సేవలో ముందుకు సాగాలి: అర్బన్ ఎమ్మెల్యే

NZB: ప్రతీ బీజేపీ కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తూ, సమాజ సేవలో ముందుకు సాగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. మంగళవారం నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, కార్యాచరణపైకార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు.

April 7, 2026 / 05:30 PM IST

రూ.39,436 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

GNTR: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

April 7, 2026 / 05:30 PM IST

మార్కెట్లో అపరిశుభ్రత.. వ్యాపారుల అవస్థలు!

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. డ్రైనేజీ సమస్య, పేరుకుపోయిన చెత్తతో దుర్వాసన వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు వెలగకపోవడం, తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు మార్కెట్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

April 7, 2026 / 05:30 PM IST

ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం: కలెక్టర్

SRD: ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి మెడికల్ కళాశాలలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

April 7, 2026 / 05:30 PM IST

మహిళ మెడలో పుస్తెలతాడు చోరీకి యత్నం

VKB: తాండూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న మహిళ ఉద్యోగం కోసం ఆర్టీసీ బస్టాండుకు వెళ్తుండగా ఆదర్శ్ నగర్ మైసమ్మ గుడి దగ్గర ఆ మహిళ మెడలో నుంచి ముగ్గురు దొంగలు పుస్తెలతాడును లాగే ప్రయత్నం చేశారు. ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఒంటరి మహిళలనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

April 7, 2026 / 05:30 PM IST

మూల్యాంకన పారితోషకం విడుదలచేయాలి: TTJAC

SDPT: గత ఏడాది పదో తరగతి పరీక్షల మూల్యాంకన పారితోషకాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ TTJAC, USPC, JACTO ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. పారితోషకాన్ని 50 శాతం పెంచాలని, ఈ ఏడాది మూల్యాంకనం పూర్తయిన వెంటనే నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

April 7, 2026 / 05:30 PM IST

‘జగన్ పాలనలో మహిళలకు రక్షణ’

అనంతపురం వైసీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. వైయస్ జగన్ పాలనలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు.

April 7, 2026 / 05:30 PM IST

ధరలు గ్యాస్ ఇబ్బందులపై ఆందోళన

NLG: యుద్ధం వల్ల పెరిగిన ధరలు, గ్యాస్ ఇబ్బందులపై సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిట్యాల మండలం వెలిమినేడులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వైఖరిని, కేరళ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను విమర్శించారు. అర్హులైన పేదలకు ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

April 7, 2026 / 05:29 PM IST

‘వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

NRML: నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం వృత్తి నైపుణ్య శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి సూచించారు. మంగళవారం రాంనగర్ పీహెచ్‌సీలో మెప్మా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కోర్సులు యువతను ఉపాధి, వ్యాపార రంగాల్లోకి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు.

April 7, 2026 / 05:29 PM IST

NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు

RR: ఈరోజు NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, చేవెళ్ల మున్సిపల్‌లోని చైతన్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు NSUI ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. చేవెల్లి మండల NSUI కమిటీ సభ్యులు సమీరుద్దీన్ మాట్లాడుతూ.. NSUI అనేది కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అని, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తుందని తెలిపారు.

April 7, 2026 / 05:29 PM IST

రూ.39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం ముగిసింది. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే, అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

April 7, 2026 / 05:28 PM IST

హజ్ కమిటీలో చోటు.. మైనారిటీల హర్షం

CTR: ఏపీ హజ్ కమిటీలో పలమనేరుకు చెందిన మౌలానా అబ్దుల్ అలీమ్ జూనెద్‌కు అవకాశం కల్పించడంపై మైనారిటీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ కేటగిరీలో సబ్ క్లాస్-3 కింద ఆయనను సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిఫారసుతో అవకాశం లభించిందని పేర్కొంటూ, టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను మైనారిటీ సోదరులు సన్మానించారు.

April 7, 2026 / 05:26 PM IST

మహిళల ఆత్మ గౌరవమే లక్ష్యంతో ఇందిరమ్మ చీరలు

RR: మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

April 7, 2026 / 05:26 PM IST

ఉప సర్పంచ్ మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ ఉప సర్పంచ్ గంగిడి లక్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఈ మేరకు నేడు వారి కుటుంబ సభ్యులను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

April 7, 2026 / 05:22 PM IST