• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సామాజిక సేవకురాలు శివలీలకు సేవా పురస్కారం

NLG: కనగల్‌కు చెందిన కంబాల శివలీల, న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఉగాది సేవా పురస్కారం అందుకున్నారు. రవీంద్రభారతిలో మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, డా. చక్రవర్తి, రిటైర్డ్ జడ్జి మాల్యాద్రి తదితరుల చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.

March 31, 2026 / 06:10 PM IST

చలివేంద్రాన్ని ప్రారంభించిన అడిషనల్ డీసీపీ

KNR: వీణవంక మండలం చల్లూరు గ్రామంలో మంగళవారం వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ (అడ్మిన్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐ, ఎస్సై ఉన్నారు.

March 31, 2026 / 06:08 PM IST

ఎన్నికల్లో దామోదర్ గౌడ్ విజయం

NRPT: నారాయణపేటలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ ప్రశాంతంగా పూర్తయ్యాయి. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దామోదర్ గౌడ్ వరుసగా ఆరోసారి విజయం సాధించారు. రాజేశ్వర్ గౌడ్ ప్యానల్‌పై దామోదర్ ప్యానల్ ఆధిపత్యం చాటుకుంది. ఉపాధ్యక్షుడిగా నందు నామాజీ, జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీగా అమీరుద్దీన్ ఎన్నికయ్యారు.

March 31, 2026 / 06:08 PM IST

వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలి: డీసీపీ

KMM: కామేపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం అడిషనల్ DCP లా, ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, విచారణ నివేదికలు, CCTNS అప్లోడ్, జనరల్‌ డైరీ రికార్డులను, సీజ్ చేసిన వాహనాలు, పరిసరాలను DCP పరిశీలించారు. గ్రామాలలో క్షేత్రస్థాయిలో అవగాహన ఉండాలని సెక్టార్ పోలీస్ ఆఫీసర్లకు సూచించారు. అటు వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.

March 31, 2026 / 06:07 PM IST

జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఎస్పీ

NGKL: లింగాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి, క్యూలైన్ ద్వారా దర్శనం, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

March 31, 2026 / 06:06 PM IST

పంట మార్పిడితోనే అధిక లాభం: డా. సతీష్

MDK: నర్సాపూర్ రైతు వేదికలో మంగళవారం సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ మాట్లాడుతూ.. నిరంతరం ఒకే రకమైన పంటలు వేయడం వల్ల భూమిలో పోషకాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటించడం వల్ల నేల సారం పెరిగి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని వివరించారు. 

March 31, 2026 / 06:05 PM IST

జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

కోనసీమ: జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ విశేష కృషి చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. అమలాపురం జిల్లా కలెక్టరేట్లో మంగళవారం డ్రగ్స్ నిరోధక కమిటీ సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. యువత మత్తుకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.

March 31, 2026 / 06:03 PM IST

కుక్కల, కోతుల బెడదకు చర్యలు తీసుకోవాలని వినతి

NTR: తిరువూరు పలు ప్రాంతాల్లో కోతులు, కుక్కల బెడద రోజు రోజుకు తీవ్రతరం అయ్యి వృద్ధులు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుక్కలు సంచారంతో రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా గాయాల పాలవుతున్నారని సోషల్ యాక్టివిస్ట్ రాం ప్రదీప్ మంగళవారం మున్సిపల్ కమిషనర్ మనోజకు వినతి పత్రం అందజేశారు. చర్యలు తీసుకోవాలని తెలిపారు.

March 31, 2026 / 06:02 PM IST

గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న మాజీమంత్రి

WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీ నందు విలేఖరి శివ గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి గృహప్రవేశ వేడుకకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు.

March 31, 2026 / 06:02 PM IST

వృద్ధ దంపతులను పరామర్శించిన ఎస్పీ

MDK: చిన్న శంకరంపేట మండలం జంగారాయలో ఇటీవల జరిగిన సంచలన దోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు బాధిత వృద్ధ దంపతులు సావిత్రి, అంజయ్యలను వారి నివాసంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల్లో భయాందోళనలు తొలగిస్తూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

March 31, 2026 / 06:01 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

SRD: నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని మన్సూర్పూర్ 8వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ నాగేష్ శెట్కార్‌తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చమ్మ, పూలమ్మ, సుజాత, సక్కమ్మ వంటి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ఇంజనీర్ మగ్గు వేసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

March 31, 2026 / 06:01 PM IST

బాలల హక్కుల పరిరక్షణ వేదిక కో-కన్వీనర్‌గా పెద్దయ్యయాదవ్

NLG: బాలల హక్కుల పరిరక్షణ వేదిక నల్గొండ జిల్లా కో-కన్వీనర్‌గా నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మెరుగు పెద్దయ్య యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు ఆర్.వెంకట్ రెడ్డి నియామకం చేసినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను, బాలల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.

March 31, 2026 / 06:01 PM IST

ఆదర్శ పాఠశాలలో మాక్ పార్లమెంట్

NZB: ఆదర్శ పాఠశాలలో మంగళవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు పార్లమెంటరీ విధానాలను ప్రతిరూపంగా ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. మినిస్టర్ నవ్య నందిని, ప్రతిపక్ష సభ్యురాలు రసజ్ఞ, ప్రైమ్ మినిస్టర్ చైత్ర, ప్రతిపక్ష అభ్యర్థి శ్రీనిత విద్యా విధానాలు, పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులపై ప్రశ్నలతో చర్చను రసవత్తరంగా మార్చారు.

March 31, 2026 / 06:01 PM IST

హనుమాన్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్

KMR: హనుమాన్ జయంతిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో శోభాయాత్ర మార్గాన్ని, ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు.

March 31, 2026 / 06:01 PM IST

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్ర కీలకం: SP

ADB: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని SP అఖిల్ మహాజన్ అన్నారు. సుదీర్ఘకాలం సేవలందించి మంగళవారం పదవి విరమణ పొందిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ జాదవ్ గుణవంత్ రావ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీస్ జాదవ్ లింభాజీ నాయక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరారు.

March 31, 2026 / 06:01 PM IST