AKP: ఎస్. రాయవరం మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మీనా కుమారి తెలిపారు. 2024 ఏప్రిల్ ఒకటి నుంచి, 2025 మార్చి 31 వరకు జరిగిన పనులపై గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించి ఆయా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసామన్నారు.
అన్నమయ్య: సానిపాయి, చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీ ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 13న జరగనున్న గంగమ్మ జాతర సందర్భంగా చాందిని బండ్లు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా 24 గంటల ముందే అనుమతి తీసుకోవాలన్నారు. ఆశ్లీల లేదా అనుమతి లేని కార్యక్రమాలు పూర్తిగా నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీరబల్లి SI సుస్మిత హెచ్చరించారు.
SKLM: అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని నరసన్నపేట ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద ఏపీ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు అంగన్వాడి ప్రాజెక్టు ఆఫీసర్‌కు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటి చట్టం రూపకల్పన చేసి అమలు చేయాలన్నారు. అంగన్వాడీలకు పెన్షన్, పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలన్నారు.
PPM: గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామ దేవత శ్రీ రేగాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మంగళవారం అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసురావు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
VZM: ఏప్రిల్ నెలలో జిల్లాలో రూ.44.47 లక్షల పని దినాలను సృష్టించేందుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్. శారదా దేవి తెలిపారు. ప్రతి మండలానికి సుమారు రూ.2 లక్షల పని దినాలు కేటాయించబడినట్లు తెలిపారు. పని అడిగిన ప్రతి వేతనదారునికి పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ASR: ముంచంగిపుట్టులోని జర్రెలలో రూ.1.40 కోట్లతో జర్రెల-మండిభ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
SS: ధర్మవరం పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మల్లెపోగుల నరసింహులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని నరసింహులు మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినందుకు కేతిరెడ్డికి గజమాల వేసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
TPT: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి జిల్లా పోలీసులు ట్రాన్స్‌పోర్ట్, అగ్నిమాపక శాఖలతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు నేతృత్వంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చెన్నై–విజయవాడ, తిరుపతి–చెన్నై, తిరుపతి-విజయవాడ మార్గాల్లో ఏర్పేడు, వడమాలపేట టోల్ ప్లాజాల వద్ద తనిఖీ చేశారు.
VKB: పురపాలక సంఘం అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం బడ్జెట్ సమావేశంలో ఆయన ఎక్స్ అఫీషియో సభ్యునిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. TUFIDC ద్వారా ఇప్పటికే రూ. 60 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే HMDA నుంచి రూ.270 కోట్ల నిధులు రానున్నాయని వెల్లడించారు.
KKD: ఏలేశ్వరం మండలం, యర్రవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షా అభియాన్‌లో 4 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమాటిక్స్ (STEM) ల్యాబ్‌ను ఎమ్మెల్యే సత్య ప్రభ మంగళవారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను, విద్యార్థులలోని నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఇందులో కూటమి నాయకులు పాల్గొన్నారు.
నెల్లూరు: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
WNP: బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో వనపర్తి జిల్లా నుంచి కేతూరి బుడ్డన్న, పురుషోత్తం రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ నియామకాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. వారు ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
NLG: చండూరు మండలానికి చెందిన న్యాయవాదులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల శాసనమండలిలో న్యాయవాదుల సమస్యలపై ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సాధారణ ప్లాస్టిక్ వందల ఏళ్లపాటు భూమిలో ఉండిపోతే, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మాత్రం సూక్ష్మజీవుల ప్రభావంతో అతి తక్కువ కాలంలోనే కరిగిపోతుంది. ఇది భూమిలో కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీరు, బయోమాస్‌గా విడిపోతుంది. ప్రస్తుతం కూరగాయల సంచులు, నర్సరీ బ్యాగుల తయారీలో దీని వినియోగం పెరుగుతోంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఆవిష్కరణ.