• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వనపర్తి నుంచి బీజేపీకి ముగ్గురు నియామకం

WNP: బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గంలో వనపర్తి జిల్లా నుంచి కేతూరి బుడ్డన్న, పురుషోత్తం రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ నియామకాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. వారు ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

March 31, 2026 / 05:51 PM IST

మద్యం సేవించిన 14 మందికి జరిమానాలు

SRCL: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 14 మందికి జరిమానాలు విధిస్తూ సిరిసిల్ల మెజిస్ట్రేట్ జయశ్రీ మంగళవారం తీర్పు వెలువరించారని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. మద్యం సేవించిన 14 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒకరికి రూ. 6 వేలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ. 5 వేలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ. 4 వేలు, నలుగురికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు, ఒక్కరికి రూ. 1500 విధించారన్నారు.

March 31, 2026 / 05:50 PM IST

ఎమ్మెల్సీ సత్యంతో న్యాయవాదుల భేటీ

NLG: చండూరు మండలానికి చెందిన న్యాయవాదులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల శాసనమండలిలో న్యాయవాదుల సమస్యలపై ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదుల ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

March 31, 2026 / 05:50 PM IST

తక్కువ కాలంలోనే కరిగిపోయే కొత్త ప్లాస్టిక్

సాధారణ ప్లాస్టిక్ వందల ఏళ్లపాటు భూమిలో ఉండిపోతే, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మాత్రం సూక్ష్మజీవుల ప్రభావంతో అతి తక్కువ కాలంలోనే కరిగిపోతుంది. ఇది భూమిలో కలిసినప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీరు, బయోమాస్‌గా విడిపోతుంది. ప్రస్తుతం కూరగాయల సంచులు, నర్సరీ బ్యాగుల తయారీలో దీని వినియోగం పెరుగుతోంది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఆవిష్కరణ.

March 31, 2026 / 05:50 PM IST

నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌లో మహాలక్ష్మీలకు సన్మానం

NRML: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగిస్తున్న మహిళలను మంగళవారం నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్‌లో సన్మానించారు. డిపో మేనేజర్ కే. పండరి మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో మహిళలు భారీగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా ఏఎంవీఐ ఆసిఫ్ పాల్గొని ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.

March 31, 2026 / 05:49 PM IST

మహాలక్ష్మీ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుంది: ఎమ్మెల్యే

WGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం మహిళలకు ఆర్థికంగా పెద్ద ఎత్తున సహాయం అందిస్తూ భరోసా కల్పించిందని MLA దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట RTC ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మహిళలు స్వావలంబన వైపు ముందుకు నడిపిస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

March 31, 2026 / 05:49 PM IST

రేపు అద్దంకిలో మంత్రి గొట్టిపాటి పర్యటన

BPT: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏప్రిల్ 1న అద్దంకి మండలంలో పర్యటిస్తారని ఆయన క్యాంప్ కార్యాలయం సిబ్బంది మంగళవారం తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పేరాయపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీతో పాటు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని వారు కోరారు.

March 31, 2026 / 05:47 PM IST

ఫుడ్ పాయిజన్.. 11 మందికి అస్వస్థత

KKD: రౌతులపూడి సామాజిక ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం జ్వరం, కడుపునొప్పి లక్షణాలతో 11 మంది చేరారు. కలుషిత ఆహారం తీసుకోవడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులు ఉప్పంపాలెం శివారులోని క్రషర్లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నట్లు వలస కార్మికులు తెలిపారు.

March 31, 2026 / 05:47 PM IST

మంగళగిరిలో చిరు వ్యాపారులకు తోడ్పాటు

GNTR: మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని పలువురు చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు, తోపుడు బండ్లు, ప్లాట్‌ఫామ్ రిక్షాలను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు అవసరమైన ఉపాధి సాధనాలను అందజేశారు.

March 31, 2026 / 05:46 PM IST

‘ఓటరు జాబితా సవరణకు పార్టీల సహకారం అవసరం’

BHPL: జిల్లాలో త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో MRO, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. BLO ప్రతి ఇంటిని కనీసం మూడు సార్లు సందర్శించి ఓటర్ల వివరాలు సరిచేస్తారని తెలిపారు.

March 31, 2026 / 05:44 PM IST

‘నిజాయితీకి నిదర్శనం మంత్రి’

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇవాళ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి పై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలుపై కొత్వాల మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి నిజాయితీకి నిదర్శనమని, అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న మహానేత అని అన్నారు.

March 31, 2026 / 05:43 PM IST

బీజేపీలో చేరిన కీలక నేత కురుబ ముక్కణ్ణ

ATP: కళ్యాణదుర్గం నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కురుబ ముక్కణ్ణ మంగళవారం BJPలో చేరారు. జిల్లా అధ్యక్షుడు కొనగొండ్ల రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ క్రమశిక్షణ, దేశాభివృద్ధి విధానాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. దేశ రక్షణ, రాష్ట్ర ప్రగతి కేవలం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు.

March 31, 2026 / 05:43 PM IST

సొంత నిధులతో పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

ATP: కంబదూరు మండలం రాళ్లనంతపురం హైస్కూల్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోరిక మేరకు రూ. 26 వేల సొంత నిధులతో 80 యోగా మ్యాట్లను అందజేశారు. పాఠశాలలో ఫ్లోరింగ్, టాయిలెట్లు, వంటగది పనులను కూడా తన సొంత ఖర్చుతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

March 31, 2026 / 05:42 PM IST

నీట్ కోచింగ్‌కు 7 విద్యార్థినులు ఎంపిక.!

KRNL: మద్దికేర మోడల్ స్కూలు నుంచి నీట్ కోచింగ్‌కు జోనల్ స్థాయిలో ఏడుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగరాజు మంగళవారం తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో వారికి ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. ఈ విజయంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

March 31, 2026 / 05:41 PM IST

‘కాంట చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మించాలి’

MNCL: బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద బస్టాండ్ నిర్మించాలని కాంగ్రెస్ నాయకులు కొలిపాక శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివిధ మండలాల నుంచి వేల సంఖ్యలో వచ్చే ప్రయాణికులు వేచి ఉండటానికి సరైన చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా బస్టాండ్ నిర్మించాలన్నారు.

March 31, 2026 / 05:41 PM IST