• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నింగిలోకి నిమ్మకాయ ధర..!

GNTR: వేసవి ప్రభావంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. ధరలు రికార్డు స్థాయికి చేరాయి. క్వింటాల్ ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. గత నెలలో ఇది రూ.4 వేలే ఉంది. దిగుబడులు తగ్గడం, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తెనాలి మార్కెట్ నుంచి బయటకు సరుకు తగ్గింది. ప్రస్తుతం రోజుకు ఒక లారీ మాత్రమే వెళ్లుతోంది.

April 1, 2026 / 09:00 AM IST

ఈ నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్

KMR: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా  ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ’30, 30(ఎ)’ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. 

April 1, 2026 / 09:00 AM IST

అలర్ట్.. నేడు విద్యుత్ నిలిపివేత

WNP: పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సబ్ స్టేషన్‌లో బుధవారం మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బస్టాండ్ రోడ్డు, కేడీఆర్ నగర్, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సుధాకర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.

April 1, 2026 / 09:00 AM IST

శృంగవరం పంచాయతీకి జాతీయ అవార్డు

AKP: నాతవరం మండలం శృంగవరం పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. సుపరిపాలనలో ఈ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్ర బృందం గత నెల 8న గ్రామాన్ని సందర్శించి ఉపాధి హామీ కూలీల హాజరు నమోదు, ఎరువులు విత్తనాలు పంపిణీ, ధాన్యం సేకరణ, సచివాలయాల్లో ఏపీ సేవా పోర్టల్ ద్వారా సేవలను అందించడం తదితర అంశాలను పరిశీలించింది.

April 1, 2026 / 09:00 AM IST

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ మోసం

ASR: చింతపల్లి మండలం తడ్డపల్లి గ్రామంలో సత్యవతి అనే మహిళ సైబర్ మోసానికి గురైంది. విద్యాశాఖ పేరుతో ఫోన్ చేసిన కేటుగాడు రూ.5,100 చెల్లిస్తే తల్లికి వందనం నగదు తమ ఖాతాలో రూ.18 వేలు వస్తాయని చెప్పి డబ్బులు కాజేశాడు. డబ్బులు రాకపోవడంతో మోసం బయటపడింది. ప్రభుత్వ పథకాల కోసం ముందస్తు చెల్లింపులు ఉండవని అధికారులు హెచ్చరించారు.

April 1, 2026 / 09:00 AM IST

పారదర్శకంగా పింఛన్ల పంపిణీ: కమిషనర్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలోని 14 వ వార్డులో పలు వీధుల్లో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

April 1, 2026 / 09:00 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం: కలెక్టర్

NZB: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. బ్లాక్ స్పాట్‌లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

April 1, 2026 / 09:00 AM IST

ఇంట్లో పని చేస్తూ ప్రమాదం – మాజీ జడ్పీటీసీ మృతి

WGL: రాయపర్తి మండలం కోలన్ పల్లి గ్రామంలో బుధవారం మాజీ జడ్పీటీసీ వంగళ యాకమ్మా ఇంట్లో పని చేస్తుండగా జారిపడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ మండల పార్టీ నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమె స్వగ్రామానికి తరలివెళ్లారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

April 1, 2026 / 08:55 AM IST

జాతీయ అవార్డుకు కుప్పం ఎంపిక

CTR: పంచాయతీ పాలనలో కుప్పం బ్లాక్ ఉత్తమంగా నిలిచి జాతీయ అవార్డుకు ఎంపికైందని DPO సుధాకర్ రావు తెలిపారు. ఇటీవల కేంద్ర బృందం కుప్పం మండలం నాయనూరు గ్రామ పంచాయతీలో పర్యటిచింది. పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించారు. సేవలు మెరుగ్గా ఉండడంతో జాతీయ పురస్కారానికి ఎంపిక చేశారని ఆయన తెలిపారు.

April 1, 2026 / 08:55 AM IST

ప్రజలకు విశ్వాసం పెరిగేలా విధులు నిర్వర్తించాలి: ఎస్పీ

MHBD: గూడూరు సీఐగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ డా.శబరీష్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూలబొకే అందజేసి పలు విషయాల గురించి చర్చించారు. పోలీసులపై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగేలా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సీఐకి సూచించారు.

April 1, 2026 / 08:54 AM IST

ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

KRNL: ఆదోని పట్టణంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప అధికారులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఎలాంటి పక్షపాతం ఉండదని తెలిపారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

April 1, 2026 / 08:53 AM IST

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు : కలెక్టర్

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఇవాళ నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. TTD పరిపాలన భవనంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్ట వస్తారని చెప్పారు.

April 1, 2026 / 08:52 AM IST

అవుకు మండలంలో నేడు మంత్రి పర్యటన

NDL: అవుకు మండలం సంగపట్నం గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. కావున మండలంలోని అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

April 1, 2026 / 08:51 AM IST

రంజిత్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కొండా సురేఖ

HNK: చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ ఇటీవల మరణించగా ఆమె చిత్రపటానికి మంత్రి కొండా సురేఖ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు ఉన్నారు.

April 1, 2026 / 08:48 AM IST

షుగర్ ఉన్నవారు పైనాపిల్ తినకూడదా?

పైనాపిల్ పోషకాల నిధి. విటమిన్-C, యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ, గుండె ఆరోగ్యం మెరుగవుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అయితే షుగర్ ఉన్నవారికి ఇది ప్రయోజనం కలిగించకపోగా హానీ చేస్తుందట. ఇందుకు పైనాపిల్‌లో సహజ చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటమే కారణంగా నిపుణులు చెబుతున్నారు.

April 1, 2026 / 08:48 AM IST