KMR: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు ’30, 30(ఎ)’ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.