SKLM: జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ జిల్లా పరిషత్ యాజమాన్యంలో వివిధ ఉన్నత పాఠశాలల్లో రికార్డు సహాయకులుగా పనిచేస్తున్న అర్హత కలిగిన ఐదుగురికి పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు మంగళవారం తన నివాసంలో వారిని జూనియర్ సహాయకులుగా నియామక పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. కష్టపడి పని చేయాలి అని సూచించారు. జడ్పీ సీఈవో సత్యనారాయణ ఉన్నారు.