• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రగతి ప్రణాళికపై మంత్రి సన్నాహక సమావేశం

SDPT: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం సూచించిన పది అంశాల అమలు సహా పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాపత్రినిధులు పాల్గొన్నారు.

March 9, 2026 / 02:36 PM IST

విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపల్

TG: హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని ఓ స్కూల్లో దారుణం జరిగింది. ఓ విద్యార్థికి ప్రిన్సిపల్ గుండు కొట్టించాడు. జుట్టు ఎక్కువగా ఉందని కత్తిరించుకోవాలని ప్రిన్సిపల్ ఆ విద్యార్థికి సూచించాడు. అయితే మొక్కు ఉందని చెప్పినా పట్టించుకోకుండా గుండు కొట్టించారని విద్యార్థి ఆరోపించాడు. ప్రిన్సిపల్ వైఖరికి నిరసనగా పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.  

March 9, 2026 / 02:36 PM IST

2026 హ్యుందాయ్ వెర్నా.. ధర ఎంతంటే?

హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెర్నా కారును దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.98 లక్షల (ఎక్స్‌షోరూమ్). 6 వేరియంట్లలో లభించే ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జత చేసిన రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే అనే రెండు రంగుల్లో లభిస్తుంది.

March 9, 2026 / 02:36 PM IST

అడిషనల్ ఎస్పీని కలిసిన MRPS నేతలు

BHPL: జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అడిషనల్ SP నరేష్ కుమార్ నాయక్‌ను సోమవారం MPRS నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో MRPS, MSP రాష్ట్ర నాయకులు చంద్రమౌళి, MRPS జిల్లా సీనియర్ నాయకులు, MSP నియోజకవర్గ ఇంఛార్జ్ బిక్షపతి, MRPS జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

March 9, 2026 / 02:35 PM IST

త్రాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి.. కలెక్టర్‌కు వినతి

E.G: బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధిలో ఎక్కువ శాతం త్రాగునీటి సమస్యపై ఉంటున్నాయని వీటిపై అధికారులు వెంటనే దృష్టి పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కోరారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన PGRSలో వినతి పత్రం అందజేశారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.

March 9, 2026 / 02:35 PM IST

వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వ్యవసాయ రంగంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని అన్నారు. అనంతరం పాలకుర్తి మహిళా సమైక్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రాన్ని ప్రారంభించారు.

March 9, 2026 / 02:35 PM IST

ఇంటర్ పరీక్షకు 167 మంది విద్యార్థులు గైర్హాజరు

AKP: జిల్లాలో సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షకు 167 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 8,050 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 7,883 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా పరీక్షలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

March 9, 2026 / 02:33 PM IST

పెనుకొండలో వినతులు స్వీకరించిన మంత్రి

సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సోమవారం మంత్రి సవితను కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వాటిని పరిశీలించిన మంత్రి.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

March 9, 2026 / 02:33 PM IST

పారిశుద్ధ్యం పనుల నాణ్యతపై కమిషనర్ తనిఖీలు

నెల్లూరు నగరంలోని 24, 25వ డివిజన్లలో సోమవారం కమిషనర్ వై.వో నందన్ పర్యటించి పారిశుద్ధ్యం, సీసీ రోడ్ల నాణ్యతను పరిశీలించారు. భవన నిర్మాణాలకు ఖచ్చితంగా టౌన్ ప్లానింగ్ అనుమతులు ఉండాలని, తాగునీటి కుళాయి పన్నులను 100 శాతం వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఇంజనీరింగ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

March 9, 2026 / 02:32 PM IST

కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలి: ఎస్సై

HNK: పరకాల పట్టణంలోని గర్ల్స్ హై-స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్టులో గెలుపొందిన విద్యార్థులకు ఎస్సై పవన్ కుమార్ బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ్, తదితరులు ఉన్నారు.

March 9, 2026 / 02:32 PM IST

మిషన్ భగీరథ వాటర్ సరఫరా బంద్

NRPT: జిల్లాలో మిషన్ భగీరథ నీటి సరఫరా సోమవారం సాయంత్రం నుంచి రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మరికల్ మండల కేంద్రంలో పైపులైన్ పగిలిపోవడంతో మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 245 గ్రామాలకు, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీలకు సరఫరాలో అంతరాయం కలగనుంది. ప్రజలు సహకరించాలని కోరారు.

March 9, 2026 / 02:31 PM IST

ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్

హైదరాబాద్‌ కోకాపేటలో అల్లు సినిమాస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ ఆసియాలోనే అతి పెద్దదైన 75 అడుగుల భారీ డాల్బీ విజన్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది మూడవ డాల్బీ థియేటర్. మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. మార్చి 18 నుండి ధురంధర్ 2 ప్రీమియర్ షోలతో బుకింగ్స్ షురూ అవుతాయి.

March 9, 2026 / 02:30 PM IST

రాజధానిలో ముళ్లపొదల తొలగింపు వ్యయం పెంపు

GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో ముళ్లపొదల తొలగింపు పనుల ఖర్చు మళ్లీ పెరిగింది. తొలుత రూ.30.50 కోట్లకు టెండర్ దక్కించుకున్న NCC (నవయుగ) సంస్థ, ఇప్పుడు ఆ వ్యయాన్ని రూ.40.53 కోట్లకు పెంచాలని సీఆర్‌డీఏను కోరింది. ఇప్పటికే రెండుసార్లు అంచనాలు పెంచగా, ఏడాది దాటినా పనులు పూర్తికాకపోవడంతో పాటు అదనంగా మరో రూ.10 కోట్లు అడగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

March 9, 2026 / 02:30 PM IST

ప్రమాణస్వీకారం చేయించిన TPCC చీఫ్ మహేష్ కుమార్

NZB: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గంతో TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షునిగా పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రాజు, కోశాధికారిగా రాజ్ కుమార్‌తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

March 9, 2026 / 02:30 PM IST

గిరినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

సూర్యాపేట ఆరో వార్డు గిరినగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఈరోజు నిర్వహించారు. కౌన్సిలర్ సునీల్ రెడ్డి, డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో జనరల్ ఆసుపత్రి నిపుణులు కంటి, దంత, స్త్రీ సంబంధిత సమస్యలకు పరీక్షలు చేశారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.ఆసుపత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు ఉన్నారు.

March 9, 2026 / 02:28 PM IST