GNTR: అమరావతి రాజధాని ప్రాంతంలో ముళ్లపొదల తొలగింపు పనుల ఖర్చు మళ్లీ పెరిగింది. తొలుత రూ.30.50 కోట్లకు టెండర్ దక్కించుకున్న NCC (నవయుగ) సంస్థ, ఇప్పుడు ఆ వ్యయాన్ని రూ.40.53 కోట్లకు పెంచాలని సీఆర్డీఏను కోరింది. ఇప్పటికే రెండుసార్లు అంచనాలు పెంచగా, ఏడాది దాటినా పనులు పూర్తికాకపోవడంతో పాటు అదనంగా మరో రూ.10 కోట్లు అడగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.