KRNL: సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి సూచించారు. నిన్న రాత్రి నందవరం మండలం హాలహర్విలో ఎస్సై తిమ్మారెడ్డితో కలిసి మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లో గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.