KRNL: దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామ సమీపంలో లక్కందిన్నె రోడ్డువైపు గడ్డివాముల వద్ద గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. హరిజన పెద్దయ్యకు చెందిన ఐదు గడ్డివాములు, వెంకన్నకు చెందిన పశువుల పాక, వ్యవసాయ సామగ్రి కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.