TG: భద్రాచలం శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న మందు మాంగల్య ధారణ ఉంటుంది. రేపు రాములవారికి మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.