NTR: కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన బొక్కా కౌశిక్ అనే వాద్యార్థి శ్రీ చైతన్య INTSE పోటీల్లో రాణించి గ్రాండ్ ప్రైజ్ కింద ల్యాప్టాప్ గెలుచుకున్నాడు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ఈ బహుమతి అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. చిన్న వయసులోనే కౌశిక్ సాధించిన ఈ విజయం గ్రామానికి గర్వకారణమని ఎమ్మల్యే అన్నారు.