CTR: శ్రీరామనవమి పర్వదినాన్ని చిత్తూరు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వీరాంజనేయ స్వామి ఆలయానికి శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వడపప్పు, పానకాలను పంచిపెట్టారు.