AP: రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. గ్రాము కొకైన్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా రవాణా చేస్తున్న అనంత్ కుమార్, మహేష్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.