WGL: మంత్రి కొండా సురేఖకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నగరంలోని కాశిబుగ్గలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు మంత్రి ఇటీవల నూతన కమిటీని నియమించింది. ఈ కమిటీని హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత కమిటీ ఆధ్వర్యంలోనే వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది.