MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని రాణిపేట గ్రామపంచాయతీ తై బజార్‌కు 2026-27 సంవత్సరానికి మార్చి 31న ఉదయం 10:30కు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు రూ.20 వేల డిపాజిట్ చెల్లించాలి. వేలం పొందిన వారు ఆరు పోస్ట్ డెబిట్ చెక్కులతో పాటు 50 శాతం మొత్తం తక్షణమే చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ తెలిపారు.