AP: తెలుగు ప్రజలందరికీ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి.. వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.