జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటివరకు కేవలం 40% మాత్రమే పూర్తయినట్లు సమాచారం. నీల్ మార్క్ భారీ యాక్షన్ సీన్లు, విజువల్ గ్రాండియర్ కోసం తీసుకుంటున్న జాగ్రత్తల వల్లే ఆలస్యమవుతోందట. దీంతో NTR ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదని సినీ వర్గాలు పేర్కొన్నాయి.