కొవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ BA.3.2 (సికాడా)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఒమిక్రాన్ జాతికి చెందినది. దీనికి రోగనిరోధక శక్తిని తట్టుకునే శక్తి ఎక్కువ. ప్రస్తుతం దీని తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఇది చాలా వేగంగా సోకుతుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.