KRNL: మంత్రాలయం ఉప సర్పంచ్ జంగం పరమేష్ స్వామి తనయుడు జంగం నవీన్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సీతారామిరెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.