అన్నమయ్య: సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముని కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.