VKB: పరిగి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సంతలో ఎండు మిర్చి ఘాటెక్కి ధరలు ఆకాశాన్నంటాయి. వేసవికాలం కావడంతో ప్రజలు ఎండుమిర్చి కొనుగోలు చేసి కారంపొడి పట్టించుకోవాలని అనుకున్న వారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ ధర రూ.200 నుంచి 300 వరకు పలుకుతుంది. మరోవైపు అన్ని రకాల కూరగాయల ధరలు సామాన్యులను అందనంత పెరిగిపోయాయి.