PDPL: ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణ రావు సహకారంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని హనుమంతునిపేట గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామంలో రూ.15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో ఉపసర్పంచ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.