MNCL: మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి పేరుతో దుకాణాలు కూల్చివేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అక్రమ కేసులకు పాల్పడడం, ఇటీవల గెలిచిన బీజేపీ ప్రజా ప్రతినిధులను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.