KRNL: పెద్దకడబూరు మండలం జలవాడి గ్రామ శివారులోని ‘చెడు వంక’ సమీపంలో జూదం ఆడుతున్న వారిని పట్టుకున్నట్లు ఎస్సై మారుతి శుక్రవారం తెలిపారు. బహిరంగ ప్రదేశంలో గుడిపి బాబుతో పాటు మరో ఆరుగురు ‘అందర్ బాహార్’ జూదం ఆడుతుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. వారి వద్ద నుండి రూ.4,200 నగదు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.