NTR: ఇబ్రహీంపట్నం, ఫెర్రీ ఏరియాల్లో రామాలయాల్లో సీతారామస్వామి కల్యాణ మహోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు సతీమణి శిరీష పాల్గొని, సంప్రదాయం ప్రకారం పూజలు చేసి, దేవతామూర్తులను దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ ముత్యాల తలంబ్రాలతో శ్రీ సీతారాముల కల్యాణాన్ని జరిపించారు.