AP: విజయనగరం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. కాసేపట్లో సీతారామల కల్యాణోత్సవం జరిపించనున్నారు. రాములోరి కల్యాణానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ, సింహాచలం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలు అందించారు.