ELR: పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ ఏడీ గోపాల్ నాయక్ కోరారు. గణపవరం (M) జల్లికొమ్మరలో శుక్రవారం గాలికుంటు నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 97 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. ఈ నెల 27 నుంచి 31 వరకు మండలవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.