BPT: వేమూరు నియోజకవర్గంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద పార్టీ జెండాను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆవిష్కరించారు. అనంతరం, పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.