TPT: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ బినామీల పేరుతో 90 పైసలకే భూములు ఇచ్చేస్తుందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బూత్ కమిటీ సభ్యులు వారి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు చేర్చకుండా చూడాలని కోరారు. తప్పు చేసిన వారు భయపడాలని, తాను అందరికి అండగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు.