RR: మహేశ్వరం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. రిటర్నింగ్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్ రెడ్డి, జి.అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా పి. శ్రీపాల్ రెడ్డి, తదితరులు ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శిగా పి.అశోక్, ట్రెజరర్‌గా జి.మల్లేశ్, లైబ్రేరియన్‌గా కే.సాయికిరణ్ ఎన్నికయ్యారు.