VKB: విద్యార్థులు ప్రపంచస్థాయి పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.పర్వతాలు అన్నారు. కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘ఎక్స్ ఫ్లోరింగ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ ఇన్ మెథడాలజీ’ అనే అంశంపై ఒక రోజు కార్యశాల నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డా.బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.