HNK: హన్మకొండ నగరంలో వేసవి నేపథ్యంలో వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలి అన్నారు.