TG: ఫ్యూచర్ సిటీ ఏరియాకు సమగ్ర మాస్టర్ ప్లాన్-2047 రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ జారీ చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ద్వారా 17 జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు ముందుకొచ్చాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఎవాల్యూషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 15 లోపు మాస్టర్ ప్లాన్ ఫైనల్ కానుంది.