SRCL: కుట్టు శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలంలోని టెక్స్ట్టైల్ పార్కులో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ కొనసాగుతుండగా, కలెక్టర్ శనివారం పరిశీలించారు. అనంతరం కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. ఈ మేరకు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.